![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -90 లో..... ప్రేమ కన్పించకపోవడంతో రెండు కుటుంబాలు టెన్షన్ పడతాయి. ప్రేమని ధీరజ్ తీసుకొని రావడంతో అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. రేవతి ప్రేమ దగ్గరికి వచ్చి ఎమోషనల్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళావ్ చెప్పి వెళ్ళాలి కదా అంటూ దిష్టి తియ్యాలంటూ ప్రేమ చెయ్ పట్టుకొని తీసుకొని వెళ్తుంటే ప్రేమ ఆపుతుంది. రేవతి ఆ మధ్యలో ఉన్న గీతని చూసి చెయ్ వదిలిపెట్టి బాధపడుతూ వెళ్ళిపోతుంది.
ఆ తర్వాత ప్రేమని వేదవతి లోపలికి తీసుకొని వెళ్తుంది. ఎందుకు ఇలా చెప్పకుండా వెళ్ళావ్.. ఎంత కంగారు పడ్డామో తెలుసా అని వేదవతి అంటుంది. ప్రేమ అసలు విషయం చెప్పబోతుంటే ధీరజ్ ఆపుతాడు. ఆ తర్వాత ఎందుకు అలా వెళ్ళావని ధీరజ్ తిడుతుంటే అప్పుడే నర్మద, వేదవతి లు ప్రేమ ఎక్కడికి వెళ్ళిందని అడుగుతారు. నగల కోసం వెళ్ళాను.. ఈ దీరజ్ నన్ను మాటలతో టార్చర్ పెడుతున్నాడు.. నీ వల్లే మా నాన్న ఇలా స్టేషన్లో ఉన్నాడంటూ నన్ను తిడుతున్నాడు.. అది భరించలేక నగల కోసం కళ్యాణ్ ని వెతుక్కుంటూ వెళ్ళానని ప్రేమ ఎమోషనల్ అవుతుంది.
వాడేదో బాధలో అన్నాడని వేదవతి సర్ది చెప్పుతుంది. ఆ తర్వాత ప్రేమని ధీరజ్ కొట్టినందుకు సారీ చెప్తాడు. ప్రేమ కూడా ధీరజ్ ని కొట్టినందుకు సారీ చెప్తుంది. ఇద్దరు కలిసి నగలు తీసుకొని రావాలనుకుంటారు. ప్రేమ దగ్గర ఫోన్ లేకపోవడంతో తన పేరుపై సిమ్ తీసుకొని నెంబర్స్ అన్ని బ్యాక్ అఫ్ చెయ్యాలనుకుంటారు. వెంటనే ప్రేమని ధీరజ్ తీసుకొని వెళ్తాడు. వాళ్ళు అలా వెళ్లడం చూసి వేదవతి, నర్మదలు హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్రేమ పేరున సిమ్ తీసుకొని మళ్ళీ ఇద్దరు తిరిగి ఇంటికి వస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |